మంచినీటి ట్యాంకులోపడి 30 వానరాలు మృతి.. భయాందోళనలో స్థానికులు

నల్గొండ (CLiC2NEWS): గృహాలకు తాగునీరు సరఫరా చేసే వాటర్ ట్యాంకులో దాదాపు 30 కోతులు పడి మృతి చెందాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిలోకాలనీలో చోటుచేసుకుంది. తాగునీరు సరఫరా చేసే ఓ ట్యాంకు నిర్మాణంపై రేకులు వేశారు. ఎండ తీవ్రతకు తాళలేక కోతులు నీళ్లు తాగేందుకు ప్రయత్నించి ఉండగా.. ట్యాంకులోకి పడిపోయి మృత్యువాతపడినట్లు సమాచారం. బుధవారం అధికారులు గుర్తించి దాదాపు 30 వానరాల కళేబరాలను బయటకు తీశారు. ఈ విషయం వెలుగులోకి రాగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోతులు చనిపోయి ఎన్నిరోజులైందో.. ఎప్పటి నుండి అవే నీటిని తాగుతున్నామని, అనారోగ్యాల బారిన పడతామని భయపడుతున్నారు.