అధికారం పోగానే కెసిఆర్‌కు రైతులు గుర్తొచ్చారు: పొంగులేటి

హైద‌రాబాద్ (CLiC2NEWS): అధికారం పోగానే మాజి సిఎం కెసిఆర్‌కు రైతులు, నీతులు గుర్తొచ్చాయ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి విమ‌ర్శించారు. ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో బిఆర్ ఎస్ నేత కెసిఆర్ పర్యటించారు. ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌ల‌కు పొంగులేటి తీవ్రంగా స్పందించారు. అధికార గ‌ర్వంలో తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌మాడార‌ని, అధికారం పోగానే ప్ర‌జ‌లు గుర్తుకువ‌చ్చార‌న్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాన్ని ప్ర‌భుత్వం మీద‌కు నెడుతున్నార‌ని, త‌మ ఉనికిని కాపాడుకునేందుకు రైతుల‌ను వాడుకుంటుంన్నార‌న్నారు. కెసిఆర్ గ‌త ప‌దేళ్ల‌లో ఎపుడైనా పంట‌లు ప‌రిశీలించారా.. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌తో న‌ష్ట‌పోతే ప‌రిహారం అందించారా అని ప్ర‌శ్నించారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల కార‌ణంగానే రాష్ట్రంలో క‌ర‌వు ఏర్ప‌డింద‌ని మంత్రి ఆరోపించారు

Leave A Reply

Your email address will not be published.