భారత నౌకాదళం అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్..
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/jobs-in-Indian-Navy.jpg)
భారత నౌకాదళం అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులైన అవివాహితులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 1.11.2003 – 30.04.2007 మధ్యలో జన్మించి ఉండాలి. ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. స్టేజ్ – 1 అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ (ఇండియన్ నేవి ఎంట్రన్స్ టెస్ట్), స్టేజ్-2 (దేహదారుడ్య పరీక్ష- పిఎఫ్టి), రాత పరీక్ష, వైద్య పరీక్షలతో ఎంపిక ఉంటుంది. సెలక్టయిన వారికి మొదటి ఏడాది రూ. 30 వేలు, రెండో ఏడాది రూ. 33వేలు, మూడో ఏడాది రూ. 36,500, నాలుగో ఏడాది రూ. 40 వేలు చెల్లిస్తారు. దరఖాస్తు రుసుం రూ. 550 గా ఉంది. దరఖాస్తులను ఆన్లైన్లో మే 13 నుండి 27 వ తేదీ వరకు స్వీకరిస్తారు.