ఐపిపిబిలో 54 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన 54 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయుటకు దరఖాస్తులను కోరుతున్నారు. ఈ పోస్టులలో 28 ఎగ్జిక్యూటివ్ (అసోసియోట్ కన్సల్టెంట్ ).. 21 ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్.. 5 ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 24 లోపు దరఖాస్తులను ఆన్లైన్లో పంపిచాల్సి ఉంది. బిటెక్/ బిఎస్సి/ ఎంసిఎ ఉత్తీర్ణతతో పాటు ఏడాది నుండి మూడేళ్ల పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు రుసుం రూ. 750 .. ఎస్సి, ఎస్టి , దివ్యాంగులకు రూ. 150గా నిర్ణయించారు.
ఎగ్జిక్యూటివ్ (అసోసియోట్ కన్సల్టెంట్ ) పోస్టులకు ఏడాదికి రూ. 10 లక్షలు జీతం అందుతుంది. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ. 15 లక్షలు, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు రూ. 25 లక్షలు చొప్పున చెల్లిస్తారు. అసెస్మెంట్, ఆన్లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూ , గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.