ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్: సుప్రీంకోర్టు
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/DELSHI-CM-KEJRIWARL.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): మద్యం కేసులో అరెస్టయిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ 1 వరకు బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. రూ. 50వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటిపై ఈ బెయిల్ మంజూరు చేసింది.