ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గడ్ (CLiC2NEWS) : వరుసగా మూడోసారి మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవి ప్రాంతంలో శుక్రవారం చేపట్టిన యాంటి నక్సల్స్ ఆపరేషన్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గత నెల 16వ తేదీన కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ చరిత్రలో అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన ఇది. అనంతరం ఏప్రిల్ 30న నారాయణ్ పుర్, కాంకేర్ జిల్లాలల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 10 నక్సల్స్ మృతి చెందారు.