కడప ఎంపిగా షర్మిలను గెలిపించండి: వైఎస్‌విజయమ్మ
![](https://clic2news.com/wp-content/uploads/2024/05/YS-Vijayamma-and-Sharmila.jpg)
కడప (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో ఉన్న ఆమె వీడియో సందేశం విడుదల చేశారు.
కడప ప్రజలకు నావిన్నపం.. వైఎస్ ఆర్ ను అభిమానించే, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్ ఆర్ బిడ్డ షర్మిలమ్మ ఎంపిగా పోటి చేస్తోంది. ఆమెను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కడప ప్రజలను ప్రార్ధిస్తున్నానని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ .. విజయమ్మ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.