సోంతూళ్లకు ఓటర్లు..
![](https://clic2news.com/wp-content/uploads/2024/05/Heavy-Traffic-in-Hyd.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ఓటర్లు సొంతూళ్లకు బయలు దేరారు. దీంతో బస్స్టేషన్లు.. రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతికో, దసరాకో ఇలా సొంతూళ్లకు వెళ్లే వారు. ఆ సమయంలో ఆర్టిసి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేది. కాని ఇపుడు ప్రత్యేక బస్సులు సరిపడినన్ని లేకపోవడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు జనసంద్రంగా మారాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఆమాంతం రేట్లు పెంచేశారు.