అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమైన చార్ధామ్ యాత్ర..
ఢిల్లీ (CLiC2NEWS): శుక్రవారం నుండి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రికి శనివారం భక్తులు పోటెత్తారు. ఇరుకైన కొండ ప్రాంతాల్లో భక్తులు రెండుగంటలకుపైగా నిలబడాల్సి వచ్చింది. హిందూ మంతంలో చార్ధామ్ యాత్ర ఓంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏటా వేసవిలో మొదలై శీతాకాలం ప్రారంభమయ్యే వరకు కొనసాగుతుంది. శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా హిమాలయాల్లోని యమునోత్రి, కేదార్నాథ్, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు యమునోత్రి , కేదార్ నాథ్ తలుపులు తెరుచుకున్నాయి.దీంతో మొదటి రోజే భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంది.