ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన ప్రకారం.. ఆగస్టు ఒకటో తేదీ నుండి కొ్త్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు పరిస్థితులపూ అధ్యయనం చేపట్టనుంది. దశల వారిగా ఈ పరిశీలన పూర్తి చేసి జులై 1 నాటికి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు 1వ తేదీ నుండి వ్యవసాయ, వ్వయసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలుకానున్నాయి. ఇందుకు గాను కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.