మహారాష్ట్రలో నవంబర్ 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు

ముంబయి: దేశంలో కరోనా మహమ్మారి రోజువారీ కేసులు పడిపోయినా కానీ మహారాష్ట్రలో మాత్రం వైరస్ విజృంభిస్తోంది. దీంతో లాక్‌డౌన్‌ను నవంబర్ 30 వరకూ పొడిగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా తగ్గుతున్నా.. మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,30,286 యాక్టివ్ కేసులున్నాయి. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఈనెల ఆరంభంలో మహారాష్ట్ర ప్రభుత్వం 50 శాతం కెపాసిటీ మించకుండా హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, బార్లను తెరిచేందుకు అనుమతించింది.