6జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కింద 2వేల వ్యాధులకు చికిత్స

ఏలూరు: రాష్ట్రంలో నవంబర్ 13నుండి 6జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కింద 2వేల వ్యాధులకు చికిత్స అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు… ఇప్పటికే 7జిల్లాల్లో ఆరోగ్య శ్రీ పధకం అమలులో ఉందని, మిగిలిన శ్రీ కాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఆరోగ్య శ్రీ పధకం అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని,ఈ క్రమంలో అన్ని జిల్లాలకు ఆరోగ్య శ్రీ పధకం అమలులోకి వస్తుందని మంత్రి ఆళ్ల నాని చేప్పారు…ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు మహిళలు మంత్రి ఆళ్ల నానిని కలిసి తమ సమస్యలు చేప్పుకున్నారు… ఏలూరు నుండి విజయవాడ బయలు దేరే ముందు బైట ఉన్న ప్రజలతో మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు… ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, దాని వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఏలూరు పడమట వీధి, ఆదివారపు పేట కు చెo దిన మహిళలు మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువచ్చారు..వెంటనే మంత్రి ఆళ్ల నాని ఆరోగ్య శ్రీ సీఈఓ తో మాట్లాడి హాస్పిటల్స్ లో పేద ప్రజలు ఆరోగ్య శ్రీ విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఫోన్ లో ఆదేశించారు…ఏలూరు, అనకాపల్లి, నంద్యాల, మార్కాపురం, బాపట్ల, మెడికల్ కాలేజ్ ల నిర్మాణానికి డిసెంబర్లో టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకుంటున్నామని, విజయనగరం, రాజమండ్రి, పెనుగొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీ ల నిర్మాణాలకు, జనవరి లో టెండర్లు పిలవ నున్నామని, వీటి కోసం 7500కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు… ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లో నాడు నేడు పనులకు మరో 5472కోట్లు రూపాయలు ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్ హెల్త్ క్లినిక్ లు వచ్చే వరకు గ్రామ, వార్డ్ సచివాలయంలో హెల్త్ క్లినిక్ లు సమాచారం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎంపానల్ అయిన హాస్పిటల్ జాబితాలు కూడ గ్రామ, వార్డ్ సచివాలయంలో ఉంచడం కోసం అన్ని జిల్లాలకు మార్గ దర్శకులు ఇచ్చినట్టు మంత్రి ఆళ్ల నాని చేప్పారు.