గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష’ కిట్లు పంపిణీ చేసిన సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): ఆధునిక టెక్నాలజితో హైదరాబాద్ ఐఐటి తయారుచేసిన సేఫ్టీ కిట్ల (కాటమయ్య రక్ష కిట్లు) పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గీత కార్మికులు చెట్లు ఎక్కుతున్నపుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి ఈ కిట్లు ఉపయోగపడతాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడలో సిఎం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా లష్కర్‌గూడ తాటివనంలో సిఎం ఈత మెక్కను నాటారు. తాటి వనాల పెంపును ప్రోత్సహించాలని గీతకార్మికులు సిఎంను కోరారు. దీనికోసం ప్రతి గ్రామంల 5 ఎకరాలు కేటాయించాలని, తాటి వనాలకు వెళ్లేందుకుఉ మోపెడ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.