బ‌డ్జెట్‌పై కాంగ్రెస్ స‌ర్కార్‌ని చీల్చి చెండాడుతాం: కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ (2024-25) పై బార‌త్ రాష్ట్ర స‌మితి, మాజీ సిఎం కెసిఆర్ స్పందించారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద గురువారం ఆయ‌న మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయం, పారిశ్రామిక‌, ఐటి పాల‌సీల‌పై నిర్ధిష్ట‌మైన విధానం ఏదీ లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత కెసిఆర్ విమ‌ర్శించారు. బిఆర్ ఎస్ స‌ర్కార్ హ‌యాంలో మేం రెండు పంట‌ల‌కు రైతు బంధు ఇచ్చాం. కాంగ్రెస్ స‌ర్కార్ దీన్ని ఎగ్గొడ‌తోందని అన్నారు. మేం రైతుల‌కు ఇచ్చిన డ‌బ్బును దుర్వినియోగం చేసిన‌ట్లు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్ర‌భుత్వ‌మ‌ని తెలుస్తోంద‌ని అన్నారు.

ఇక ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. విద్యుత్‌, నీటి స‌ర‌ఫ‌రా, గొర్రెల పంపిణీ లేదు, రైతు భ‌రోసా గురించి ప్ర‌స్థావ‌నే లేదు. కాంగ్రెస్ ప్ర‌బుత్వం రైతులు, వృత్తి కార్మికుల‌ను వంచించింద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింద‌ని, ఇది పేద‌ల‌, రైతుల బ‌డ్జెట్ కాద‌ని కెసిఆర్ విమ‌ర్శించారు.

Leave A Reply

Your email address will not be published.