ధ‌వళేశ్వ‌రం వ‌ద్ద రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (CLiC2NEWS): ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రి న‌దికి వ‌ర‌ద మ‌ళ్లీ క్ర‌మంగా పెరుగుతోంది. నిన్న‌టి (శుక్ర‌వారం) వ‌ర‌కు హెచ్చుత‌గ్గుల‌తో కొన‌సాగిన గోదావ‌రి న‌ది వ‌ర‌ద ప్ర‌భావం.. ఇవాళ (శ‌నివారం) ఉద‌యం నుంచి పెరుగుతోంది. ఈ వ‌ర‌ద నీటితో ధ‌వ‌ళేశ్వ‌రం కాట‌న్ బ్యారేజీ వ‌ద్ద 13.70 అడుగుల నీటి ప్ర‌వాహం కొన‌సాగుతుండ‌టంతో అధికారులు రెండు ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు. దాంతో స‌ముద్రంలోకి 12.72 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు.

అలాగే భ‌ద్రాచ‌లం వ‌ద్ద నీటి ప్ర‌వాం భారీగాపెరుగుతోంది. ఈ వ‌ర‌ద నీరు పెరుగుద‌ల‌తో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. అలాగే కోన‌సీమ‌లోని గౌత‌మి, విశిష్ఠ‌, వైన‌తేయ న‌దీ పాయ‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. దీంతో లంక గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.