కేరళలోని వయనాడ్ ఘటన.. కేరళ సిఎం సహాయనిధికి సినీ ప్రముఖుల విరాళాలు..
టెరిటోరియల్ ఆర్మీలో లెప్టినెంట్ కల్నల్ గా మోహన్‌లాల్..
హైదరాబాద్ (CLiC2NEWS): వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయినారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలిపి రూ. కోటి కేరళ సిఎం సహాయనిధికి విరాళం ప్రకటించారు. తాజాగా అల్లు అర్జున్ రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. ఇప్పటికే నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు రూ. 20 లక్షలు, హీరో సూర్య- జ్యోతిక దంపతులు, కార్తి కలిపి రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ. 35 లక్షలు , విక్రమ్ రూ. 20 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ. 25 లక్షలు విరాళం అందించారు. కమల్‌హాసన్ రూ. వయనాడ్ బాధితుల కోసం రూ. 25 లక్షలు ప్రకటించారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న హీరో మోహన్‌లాల్..
మరోవైపు బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపుకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీ లో లెప్టినెంట్ కల్నల్ గా ఉన్న ఆయన విపత్తు ప్రాంతాన్ని పరిశీలించి సైనికులతో సామావేశమయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడున్న విశ్వశాంతి ఫౌండేషన్‌లో నేనూ భాగమేనన్న ఆయన.. విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా సహాయక చర్యల కోసం రూ. 3 కోట్లు విరాళం ప్రకటించారు.