వారంలో ఒక్క‌రోజైనా చేనేత వ‌స్త్రాలు ధ‌రిచండి: డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్

అమ‌రావ‌తి (CLiC2NEWS): జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్బంగా చేనేత కార్మికులంద‌రికీ ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు వారంలో ఒక్క‌రోజైనా చేనేత వ‌స్త్రాలు ధ‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దేశ స్వాతంత్య్రోద్య‌మంలో చేనేత వ‌స్త్రాలు అనే మాట ప్ర‌జ‌ల్లో ఒక భావోద్వేగాన్ని నింపింద‌ని అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంగ‌ళ‌గిరి, చీరాల‌, వెంక‌ట‌గిరి, పొందూరు, పెడ‌న‌, ఉప్పాడ‌, ఎమ్మిగ‌నూరు.. చేనేత వ‌స్త్రాల‌కు ప్ర‌తీక‌లన్నారు. దేశంలో అతిపెద్ద అసంఘ‌టిత ఆర్థిక కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే రంగాల్లో చేనేత ఒక‌ట‌ని.. ఇదొక క‌ళాత్మ‌క‌మైన ప‌రిశ్ర‌మ‌ని అన్నారు. కొన్నేళ్ల కింద‌ట తాను చేనేత వ‌స్త్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటానన్నారు. ఆ క్ర‌మంలో నేత వ‌స్త్రాల‌ను ధ‌రిస్తున్నాన‌ని తెలిపారు. యువ‌త‌, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రిస్తే ఈ రంగంపై ఆధార‌ప‌డ్డ వారికి ధీమా క‌లుగుతుంద‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.