Vijayawada: రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికుల అవస్థలు

విజయవాడ (CLiC2NEWS): భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. రైల్వే ట్రాక్‌లపైకి వరదనీరు భారీగా ప్రవహిస్తుండటంతో పలు ట్రాక్‌లు ధ్వంసం అయ్యాయి. రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో విజయవాడతో పాటు రాయనపాడు రైల్వేస్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు రైళ్లరద్దును మరో రెండు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వేస్టేషన్ల వద్ద ట్రాక్‌పైకి వరద నీరు చేరడంతో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో రైల్వేస్టేషన్లలో ఉన్న ప్రయాణికులను 50 బస్సుల్లో విజయవాడ రైల్వేస్టేషన్‌కు తరలించారు.