ఐఎఎస్ అకాడ‌మీకి రూ.5ల‌క్ష‌ల జ‌రిమానా..!

ఢిల్లీ (CLiC2NEWS): సివిల్స్ రాసే అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చే ఓ ఐఎఎస్‌ సంస్థకు కేంద్ర వినియోగ‌దారుల భ‌ద్ర‌త సంస్థ (సిసిపిఎ) రూ. 5ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. శంక‌ర్ ఐఎఎస్ అకాడ‌మీ.. స‌క్సెస్ రేటు, సివిల్స్ ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థుల గురించి త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ట్లు భావించిన సిసిపిఎ చ‌ర్య‌లు చేప‌ట్టింది. 2022 యుపిఎస్‌సి సివిల్ స‌ర్వీస్ ప‌రీక్ష కోసం శంక‌ర్ ఐఎఎస్ అకాడ‌మి ఇచ్చిన యాడ్‌లో ఆల్ ఇండియా లెవ‌ల్‌లో ఎంపికైన 933 మందిలో 336 మంది త‌మ అకాడ‌మీలో శిక్ష‌ణ తీసుకున్న‌ట్లు పేర్కొంది. టాప్ 100లో త‌మ ఇనిస్టిట్యూట్ నుండి 40 మంది అభ్య‌ర్ధులు ఉన్న‌ట్లు ప్ర‌చురించింది. దేశంలో ఉత్తమ ఐఎఎస్ అకాడ‌మి త‌మ‌దేనంటూ ప్ర‌క‌టన‌లో రాసింది. దీనిపై ఫిర్యాదులు రావ‌డంతో సిసిపిఎ ద‌ర్యాప్తు జ‌రిపింది.

శంక‌ర్ అక‌డ‌మీ నంఉడి ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు చెబుతున్న 336 మందిలో 221 మంది కేవ‌లం ఉచిత ఇంట‌ర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్‌ను మాత్ర‌మే తీసుకున్నారని సిసిపిఎ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. మిగ‌తావారు షార్ట్‌ట‌ర్మ్ కోచింగ్‌కు తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థులు తీసుకున్న కోర్సుల‌ను ఇనిస్టిట్యూట్ దాచిపెట్టిన‌ట్లు తేలింది. దీంతో శంక‌ర్ ఐఎఎస్ అకాడ‌మి ఉద్దేశ్యపూర్వ‌కంగానే ఆ ప్ర‌క‌ట‌న ఇచ్చిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. ఇలాంటి త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌లు సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న‌వారిపై ప్ర‌భావం చూప‌సిస్తాయని సిసిపిఎ పేర్కొంది. అందువ‌ల్ల అకాడ‌మిఈకి రూ. 5ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.