బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి రాలేకపోతున్నా: సిఎం చంద్రబాబు

అమరావతి (CLiC2NEWS): బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి రాలేకపోతున్నట్లు సిఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిసిస్తున్న సిఎం చంద్రబాబు.. హైదరాబాద్‌లో జరుగుతున్న బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి రాలేకుపోతున్నానని తెలిపారు. బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలని ఆకాంక్షిస్తూ.. బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు.