ఆక్రమణల వలనే ఖమ్మంలో భారీ వరదలు: సిఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం (CLiC2NEWS): జిల్లాలో 75 ఏళ్లలో ఎన్నాడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సిఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని.. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందజేస్తామని ప్రకటించినట్లు తెలిపారు.