జాతీయ పోషకాహార వారోత్సవం

జాతీయ పోషకాహార వారోత్సవాన్ని భారతదేశంలో సెప్టెంబర్ 1 నుండి 7 వరకు ప్రతి సంవత్సరం జరుగుతాయి. నేషనల్ న్యూట్రిషన్ డే. ఈ సంవత్సరం నేషనల్ న్యూట్రిషన్ వీక్ డే థీమ్ .. ”అందరికీ పోషకమైన ఆహారాలు ”.  ఈ థీమ్ ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి కోసం లక్ష్యాన్ని నిర్దిస్తుంది. జీవితంలో వివిధ దశల్లో వ్యక్తుల యొక్క పోషక అవసరాలను తీర్చే ఆహారాన్ని ప్రోత్సహించడానికి నొక్కి చెబుతుంది. ఈ కార్యక్రమం ప్రజలకు, మహిళలకు, పిల్లలకు,యువతి యువకులకు, సమతుల్య ఆహారం మంచి పోషకాల ఆహారాలను మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చురుకైన జీవనశైలి యెుక్క ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం పై దృష్టి పెడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాధరణ పోషకాహార విలువలను దృష్టిలో ఉంచుకొని భారతదేశం కూడా ప్రతి సంవత్సరము జాతీయ పోషక ఆహార వారోత్సవాన్ని సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జరుపుకుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త కొత్త రోగాలు రావడం.. దాని గల కారణం మన జీవన విధానంలో పెను మార్పు రావటం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము పొట్టకూటి కోసము ఏదో ఒక పనినీ నిరంతరం చేయాల్సి వస్తుంది. దీనికి పగలు రాత్రి అనే తేడా లేకుండా విధి నిర్వహణలు చేయవలసి వస్తుంది. మరియు సరైన సమయానికి ఆహారం తీసుకోపోవటం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా అవటం వలన మనకు కొత్త కొత్త రోగాలు రావడం జరుగుతుంది.

మ‌న‌ము తినే ఆహార పదార్థాలు నాణ్యత లేకపోవడం, తినే ఆహార పదార్థాలకు కెమికల్స్ ఎక్కువ వాడ‌టం, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం, తిన్నది అరగక పోవటం వలన గ్యాస్, అసిడిటీ, మలబద్ధకము, పైల్స్ మరియు ఆమ వాతము, లివర్ ఇన్ఫెక్షన్, మధుమేహము, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ లో రాళ్లు,ఇంకా దీర్ఘ కాలపు వ్యాధులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నచిన్న వ్యాధులకు మనం యాంటీ బయాటిక్స్ ఎక్కువ వాడటం వలన రోగం నిరోధక శక్తి తగ్గుతుంది. దానితో మన ఆరోగ్యం దెబ్బతింటుంది.
కరోనా సమయములో ఏ మందులు వాడిన సరిగ్గా పనిచేయలేదు. దానికి ప్రత్యామ్నాయంగా న్యూట్రిషన్స్ తీసుకున్న వాళ్లు మాత్రమే ఆరోగ్యవంతులవ్వటం జరిగింది. దాని దృష్ట్యా ప్రజలందరూ న్యూట్రిషన్ వైపుకి మరలినారు. దీని అర్థం “రిటర్న్ టు నేచర్”అంటే తిరిగి ప్రకృతి వైపు మనం పయనం అవుతున్నమని అర్థం.

మన జీవనానికి ఆహారం కావాలి.మనం సేవించిన ఆహారం చక్కగా జీర్ణం కావాలి. మనిషి యొక్క ఆరోగ్యం అతని యొక్క జటరాగ్ని పై ఆధారపడి ఉంటుంది మనం సేవించిన ఆహారం సరిగ్గా జీర్ణమైనటట్లు చేయడం పని, అనేక వ్యాధులకు ముఖ్యమైన కారణం జటరాగ్ని సక్రమంగా పని చేయకపోవడం అని శాస్త్రాలు చెప్తున్నాయి.

బలము,ఆరోగ్యము, ఆయువు, ప్రాణములు అనేవి జటరాగ్ని ను అనుసరించి ఉండును అన్న పానముల చే తనే జటరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అవి లేకున్నా జటరాగ్ని నశిస్తుంది మనం సేవించిన ఆహారంలో శరీర పోషణకు కావాల్సిన ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు,విటమిన్లు, ఖనిజలవణాలు, పీచు పదార్థాలు మరియు నీరు మొదలగున్నవి.


చక్కని ఆరోగ్యం కోసం రోగనిరోధక శక్తి కోసం, రోగాలు రాకుండా ఉండేందుకు రోగాలు వచ్చిన సరే వాటిని తగ్గించుకునేందుకు పాటించ‌వ‌ల‌సిన ఆహార నియ‌మాలు..

1. మనం సేవించిన ఆహారంలో శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్లు ఉండాలి. ఇది ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్,ఫ్యాట్ మినరల్స్,విటమిన్స్ ఇవన్నీ సమంగా ఉండే ఆహారాన్ని బ్యాలెన్స్ డైట్ అంటారు.
2. కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిచ్చే అతి ముఖ్యమైనవి. కార్బోహైడ్రేట్లు ఇవి ముఖ్యంగా పిండి పదార్థాలు, తృణముల ధాన్యాలు, కూరగాయలు,చెరుకు రసం గ్లూకోస్ పాటు లాక్టోజ్ శరీరను కావాల్సిన 50 70 శాతం శక్తి కార్బోహైడ్రేట్ ల ద్వారా లభిస్తుంది. శక్తిని కలిగించే అతి ముఖ్యమైన గ్లూకోస్ మొదలు ఉన్నది.
3. ప్రోటీన్లు అంటే మాంసకృతులు, శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం. పిల్లలు ఎదుగుదలకు మరియు పెద్దల శరీర బరువుకు ప్రోటీన్లు చాలా అవసరం ప్రోటీన్స్ కొద్దిగా శక్తిని కూడా ఇస్తాయి.ఈ ప్రోటీన్స్ అనేవి కెమికల్ కాన్స్టెన్సీ అయిన అమైనో ఆసిడ్స్ ద్వారా ఏర్పడతాయి.
4. క్రొవ్వులు అంటే ఫ్యాట్ మొత్తం క్రొవ్వు తీసుకోవటం, మొత్తం శక్తి తీసుకోవడంలో 30% తక్కువగా ఉండాలి. నూనె మరియు క్రొవ్వులు శక్తినిచ్చే అతిముఖ్యమైన పదార్థములు. ఇది ఎసెన్షియల్ పార్టీ ఆసిడ్స్ మరియు ఫ్యాట్ సాలిడ్స్ విటమిన్స్లను కలిగి ఉంటాయి. చక్కని శరీర నిర్మాణానికి కొవ్వు చాలా అవసరము. శరీరానికి అధిక క్రొవ్వు వాడితే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
5. కాల్షియం మరియు ఫాస్పరస్. ఇది ఎముకలు మరియు దంత నిర్మాణం లోని తోడ్పడతాయి.
6. మినరల్స్. మన ఆహారం నుండి శరీరానికి దాదాపు 24 మినరల్స్ అందుతాయి అందులో ముఖ్యమైనవి కాల్షియం ఫాస్ఫరస్, పొటాషియం సోడియం,క్లోరైడ్ మెగ్నీషియం,ఐరన్ కాపర్ అయోడిన్, కోబాల్ట్ ఫ్లోరిన్ మరియు జింక్ ఇవి శరీర నిర్మాణానికి చాలా అవసరం.
7. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ యొక్క నిర్మాణాన్ని తోడ్పడతాయి.
8. అయోడిన్. థైరాయిడ్ గ్రంధి చక్కగా పనిచేయడం తోడ్పడుతుంది
9. నీరు, శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు అన్నిటినీ సంరక్షిస్తుంది. మరియు రక్తం యొక్క శరీర ద్రవాల యొక్క వాల్యూమ్ని సక్రమంగా ఉండేటట్లు చూస్తుంది. కనుక ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీరు తాగవలెను. శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటకు పంపించడం జరుగుతుంది.
10. మరియు ఋతువులను బట్టి వచ్చే ఆకుకూరలు, కూరగాయలు, మరియు పండ్లు, జామ,నేరేడు, కివి బొప్పాయ, దానిమ్మ ,యాపిల్,అరటి తినవలెను. పుచ్చకాయ, ద్రాక్ష, బత్తాయి, ఆపిల్, పైన్ యాపిల్ ఫ్రూట్స్ జ్యూస్,వీటిని తీసుకోవలెను,


11. మొలకెత్తిన విత్తనాలు, బాదం,కిస్మిస్,అంజీర, ఎండు ఖర్జూర, నువ్వులుండలు, పచ్చి కొబ్బరి, బెల్లం, తీసుకోవలెను.
12. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి క కాల కృత్యములు చేసుకుని రెండు గ్లాసులు మంచినీటిని కూర్చుని తాగి, శారీరక వ్యాయామము చేయవలెను.
13. ఉదయం అల్పాహారంలో వెజిటేబుల్ సలాడ్స్ తీసుకోవలెను కీర దోసకాయ, ఒక టమాట, ఒక ముల్లంగి, ఒక బీట్రూట్, ఒక క్యారెట్ కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసి అన్ని కలిపి దాని మీద కొద్దిగా నిమ్మరసాన్ని చల్లి మరియు దానిపై మిరియాల చూర్ణం వేసి చక్కగా తినవలెను. దాని తర్వాత రెండు టీ స్పూన్స్ తేనె నాకవలెను. లేదా యాపిల్, జామ, బొప్పాయి, దానిమ్మ , ద్రాక్ష లాంటివి చక్కగా స్లైస్ చేసుకొని తినవచ్చును. లేదా మిల్లెట్స్ రాగి, జొన్న, జాf తాగవచ్చు. వయసుని బట్టి ఆహారాన్ని తీసుకోవలెను.
14. 11 గంటలకి కాలాన్ని బట్టి గ్రీన్ టీ లేదా లెమన్ టీ తాగవలెను . లేదా బత్తాయి juice గాని ఇతర ఫ్రూట్స్ జ్యూస్ గాని తాగవచ్చు.
15. మధ్యాహ్నం అల్పాహారము ఒక చపాతి ఒక చిన్న కప్పు అన్నము తినవలెను తర్వాత ఒక గ్లాస్ పలుచటి మజ్జిగలో కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు మరియు చిటికెడు మిరియాల చూర్ణం కలిపి తాగవలెను . మజ్జిగ తక్రం ఇది గ్యాస్ని మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మిరియాల చూర్ణము యాంటీ వైరల్ గా యాంటీ ఇన్ఫెక్షన్ గా చక్కగా పనిచేస్తూ జ్వరాలు రాకుండా కాపాడుతుంది.


16. సాయంత్రం ఐదు గంటలకి శరీరానికి చక్కని వ్యాయామము యోగా ధ్యానము చేయవలెను.
17. రాత్రి ఏడు గంటలకి ఫ్రూట్స్ సలాడ్స్ గాని, లేదా చపాతి లేదా జొన్న రొట్టె లేదా ఒక గ్లాసు గోరువెచ్చని పాలు దానిలో ఒక పావు టీ స్పూను అశ్వగంధ చూర్ణం కలిపి తాగవలెను. చక్కని నిద్ర కోసం సంగీతాన్ని లేదా మరియు పుస్తకాన్ని గాని చదవడం ఆరోగ్యకరం.
18. ప్రతి మనిషి తన ఆరోగ్యంతో పాటు తన కుటుంబంలో వున్నవారి ఆరోగ్యం కూడా చక్కగా ఉండేటట్లు ఆహార నియమాల్ని పాటిస్తూ మరియు ఖాళీ సమయాల్లో ని చెట్లను పెంచడం,మనకు వీలుంటే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, చేతనైతే ఇతరులకు సహాయం చేయటం వలన మనమందరం ఆరోగ్యంగా ఉంటాం.

Leave A Reply

Your email address will not be published.