అయోధ్య నుండి సీతామ‌ఢికి వందేభార‌త్ ఇవ్వండి: బిహార్‌ సిఎం

ప‌ట్నా (CLiC2NEWS): ఆయోధ్య‌, సీతామ‌ఢి మ‌ధ్య వందేభార‌త్ రైలును ఏర్పాటు చేయాల‌ని బిహార్ సిఎం నితీశ్ కుమార్ ప్రధాన‌మంత్రికి లేఖ రాశారు. యుపి-బిహార్‌ల‌లో రెండు ప్ర‌సిద్ధ ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను క‌లుపుతూ సెమీ-హైస్పీడ్ రైలును ఏర్పాటు చేయాల‌ని ఆదివారం లేఖ‌లో కోరారు. ఆయోధ్య నుండి సీతామ‌ఢి(జాన‌కి పుట్టిన ప్రాంతంగా భావించే స్థ‌లం) వ‌ర‌కు రామ్‌-జాన‌కీ మార్గ్ అభివృద్ధికి సంబంధించిన నిర్మాణ ప‌నున‌లు ఇప్ప‌టికే కేంద్రం ప్రారంభించ‌డం సంతోష‌దాయ‌క‌మ‌ని నితీశ్ పేర్కొన్నారు. అయోధ్య‌లోని రామ‌మందిరం, బిహార్‌లోని పునౌరా ధామ్ జాన‌కీ మందిర్ మ‌ధ్య యాత్రికుల‌కు మెరుగైన ర‌హ‌దారి సౌక‌ర్యం క‌ల్పించేలా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు . ఈ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని సంబంధిత మంత్రిత్వ‌శాఖ‌ను ఆదేశించాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.