సిరిసిల్ల: 200 గ్రాముల బంగారంతో చీర..

రాజన్న సిరిసిల్ల (CLiC2NEWS): జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ బంగారంతో చీర తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేయమని కోరాడు. తన కుమార్తె వివాహం కోసం ఈ చీరను తయారుచేయిస్తున్నట్లు సమాచారం. దీంతో విజయ్ 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు కలిగిన 800 గ్రాముల బరువు ఉండేటట్టుగా బంగారంతో చీర తయారు చేశాడు. ఈ చీరను రూ.18 లక్షల వ్యయం చేసినట్లు విజయ్ తెలిపారు. బంగారంతో చీర తయారు చేయడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.