`సుప్రీం` తదుపరి సిజెఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
సిఫారసు చేసిన సిజెఐ జస్టిస్ చంద్రచూడ్

న్యూఢిల్లీ (CLiC2NEWS): సుప్రీం కోర్టు తదుపరి సిజెగా సీనియర్ జడ్జీ జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత సిజెఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కేంద్ర సర్కార్‌కు ప్రతిపాదించారు. ఈ సిఫారసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే సుప్రీం కోర్టు 51వ సిజెఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు.
నిబంధనల ప్రకారం ఈ ప్రతిపాదనను ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి లేఖ రేపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధాని పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం అనంతరం రాష్ట్రపతికి చేరుకుంటుంది. చివరగా ప్రెసిడెంట్ అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు.
సంప్రదాయం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీం కోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సీఫార సు చేస్తారు. ఆ ప్రకారం చూప్తే జస్టిస్ చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు. ప్రస్తుత సిజెఐ పదవీకాలం నవంబర్ 11తో ముగియనుంది. అంటే నవంబరు 12వ తేదీన జస్టిస్ ఖన్నా సిజెఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.