పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు

గువాహటి (CLiC2NEWS): లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పి ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలోని దిమా హసావో జిల్లాలో దిబలోంగ్ స్టేషన్ వద్ద రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగర్తలా నుండి ముంబయికి బయల్దేరిన ఈ రైలు ఇంజిన్‌తో సహా 8 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.