Parigi: ఉపకార వేతనాలు విడుదల చేయాలి

పరిగి (CLiC2NEWS): ఉపకార వేతనాలు అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విద్యార్థులు ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఉపకార వేతనాలను విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పరిగిలో ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రాహదారిపై ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.