ప్ర‌ముఖ వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత

చెన్నై: వయోలిన్ విద్వాంసుడు,పద్మ అవార్డుల గ్రహీత టీఎన్ కృష్ణన్(92) కన్నుమూశారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ… సోమవారం స్వాయంత్రం హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో తన నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. కృష్ణన్ మృతి సంగీత అభిమానులను విషాదంలో ముంచెత్తింది.

1926 అక్టబరు 6వతేదీన కేరళలో జన్మించిన కృష్ణన్ తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నై మ్యూజిక్ కళాశాలలో పనిచేసిన కృష్ణన్ చాలామంది విద్యార్థులకు వయోలిన్ నేర్పించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్ గా కూడా పనిచేశారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత కళానిదిి వంటి పలు పురస్కారాలన కృష్ణన్ అందుకున్నారు. దేశంలో వేలాది సంగీత కచేరీలు చేసిన కృష్ణన్ మృతి పట్ల సంగీతప్రియులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.