శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు: మంత్రి రామ్మోహన్నాయుడు
అమరావతి (CLiC2NEWS): శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సిఎం చంద్రబాబు పర్యటన ముగిసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి వలసలు అరికడతామని కేంద్రమంత్రి తెలిపారు. గత ఐదేళ్లు నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన ఆయన ..2025 నాటికి వంశధార ఫేజ్-2 పూర్తి చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అరసవల్లి ఆలయలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.