బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫి: భార‌త్ రెండో ఇన్నింగ్స్ 487/6

పెర్త్ (CLiC2NEWS): భార‌త్ -ఆసీస్ జ‌ట్ల మధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 487/6 స్కోరు వ‌ద్ద డిక్లేర్డ్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే స‌మాయానికి టీమ్ ఇండియా వికెట్ న‌ష్ట‌పోకుండా ఓపెన‌ర్లు 172 ప‌రుగులు చేశారు.  మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ ఇండియా 534 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కంగారుల‌కు నిర్దేశించింది. టీమ్‌ జైస్వాల్ 161 ప‌రుగు లు చేయ‌గా విరాట్ కోహ్లీ 100 సెంచ‌రీ చేశాడు. కోహ్లీ 16 నెల‌ల త‌ర్వాత శ‌త‌కం సాధించి అభిమానుల్లో జోష్ నింపాడు. ఇక కెఎల్ రాహుల్ 77 , నితీశ్ 38 ప‌రుగులు చేశాడు. అనంత‌రం ఆట ప్రారంభించిన అస్ట్రేలియా జ‌ట్టు మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్లు న‌ష్ట‌పోయి 12 ప‌రుగులు చేసింది.

మూడో రోజు ఆసీస్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ చేసిన సెంచ‌రీతో రికార్డు సృష్టించి స‌చిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై అత్య‌ధిక సెంచరీలు చేసిన స‌చిన్ రికార్డును అధిగ‌మించాడు. ఆసీస్‌ గ‌డ్డ‌పై కోహ్లీకి ఏడో సెంచరీ. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు స‌చిన్ (6 సెంచ‌రీలు) పేరిట ఉండేది.

Leave A Reply

Your email address will not be published.