సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌.. పోలీసుల అదుపులో అల్లుఅర్జున్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ముఖ సినీ న‌టుడు అల్లు అర్జున్ ని చిక్క‌డిప‌ల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో బ‌న్నిని అరెస్ట్ చేసిన‌న‌ట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. అల్లు అర్జున్ థియేట‌ర్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో తొక్కిస‌లాట తొక్కిస‌లాట జ‌రిగి రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అల్లుఅర్జున్‌పై 105,118 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదైంది.

అల్లు అర్జున్ అరెస్ట్‌పై సినీ ప్ర‌ముఖులు స్పందించారు. ర‌ష్మిక‌, అనిల్ రావిపూడి, నితిన్ , సందీప్, ర‌ష్మిక‌, అరుణ్ ధావ‌న్‌, నాని తదిత‌రులు రియాక్ట్ అయ్యారు.

బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ స్పందిస్తూ.. ఈ ఘ‌ట‌న బాధ‌క‌రమని, భ‌ద్ర‌తాప‌ర‌మైన‌, ఇత‌ర అంశాల‌ను న‌టీన‌టులు ఒక్క‌రే చూసుకోలేరు. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మాత్ర‌మే వాళ్లు చుట్టు ప‌క్క‌ల వారికి సూచిస్తుంటారు. ఒక వ్య‌క్తిని మాత్ర‌మే నిందించ‌డం అన్యాయం అని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నేను న‌మ్మ‌లేకపోతున్నాన‌ని, ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం. హృద‌యాన్ని క‌లిచివేస్తుందని .. ఒకే వ్య‌క్తిని నిందించ‌డం స‌బ‌బు కాద‌ని హీరోయిన్ ర‌ష్మిక స్పందించారు.

అల్లుఅర్జున్ ఒక్క‌రినే బాధ్య‌త వ‌హించ‌మ‌న‌డం స‌రికాదు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవ‌డంలో ఆయ‌న బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకుందామ‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.