మెదడు చురుకుగా పనిచేయాలంటే..
మన మెదడు ఎల్లప్పుడూ షార్ప్‌గా ఉండాలంటే ప్రతి రోజూ ఏదో ఓ కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలంట. నిరంతరం ఒక కొత్త పని చేయటం కాని, ఒక కొత్త అలవాటు కాని నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అపుడు మన మొదడు చురుకుగా పనిచేస్తుందట. ఒక కొత్త భాషను నేర్చుకోవడం.. కొత్తగా ఏదైనా.. ఇంట్లో ఉండే ఆడవారైతే కొత్త వంటకం నేర్చుకోవడం, కొత్త మొక్కలు పెంచడం.. ఇలా ఏదైనా కొత్తది ట్రై చేయాలంట. అపుడే మొదడు షార్ప్‌గా ఉంటుందట. మతి మరుపుకూడా రాదంటున్నారు. జ్ఞాపకశక్తి , ఏకాగ్రత పెరుగుతాయట. కొత్త పుస్తకాలను చదవటం, కొత్త అంశాలను నేర్చుకోవడం, పజిల్స్ నింపడం వంటివి కూడా మెదడుపై ప్రభావం చూపుతాయి. దీంతో మొదడు యాక్టివ్‌గా ఉంటుంది.
మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మొదడు మొద్దు బారిపోతుందట. తాజా పండ్లు , కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు, వాల్‌నట్స్ , బాదం, అవిసె గింజలు , గుమ్మడి కాయ విత్తాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి మొదడుకు కావాల్సిన పోషకాలను అందించి మొదడు పనితీరును మొరుగుపరుస్తాయి. క్రొవ్వు పదార్థాలు , నూనెతో తయారు చేసినవి, జంక్‌పుడ్ , మాంసం అతిగా తింటుంటే మొదడుపై ప్రభావం పడుతుంది.
ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి. కనీసం అరగంట సేపు నడవడం కానీ.. వ్యాయామం చేయడం కాని మర్చిపోకూడదు. ఇది రోజులో ఒక భాగం కావాలి. ఉదయం పూట వాకింగ్ చేస్తే కచ్చితంగా మూడ్ మారుతుందంటున్నారు. అదేవిధంగా మొదడుకు తగినంత విశ్రాంతి కూడా ఇవ్వాలంటున్నారు. నిద్ర సరిగా లేకపోతే ఆరోజు పనులు చేయడానికి మనం యాక్టివ్ గా ఉండలేము. అదేవిధంగా మన మెదడు కూడా మెద్దు బారిపోతుంది. కనీసం 7 నుండి 9 గంటల పాటు నిద్రకూడా అవసరమేనట. మెదడు చురుకుగా పనిచేయడానికి తగినంత నిద్ర అవసరం. ఎంత బిజీగా ఉన్నా.. నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మొదడును ఎల్లప్పుడూ చురుకుగా పనిచేసేలా ఉంచుకోవచ్చు.