కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు
కోల్‌కతా (CLiC2NEWS): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు విధించింది న్యాయస్థానం. సంజయ్ రాయ్‌కి మరణ శిక్ష విధించాలని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సంజయ్ .. తనను తప్పుగా కేసులో ఇరికించారని వాదనలు వినిపించాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అరుదైన కేసు కేటగిరిలోకి రాదని వ్యాఖ్యానించారు. మరణ శిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపారు. దోషి సంజయ్ రాయ్‌కి కోల్‌కతా సియాల్దా కోర్టు జీవతఖైదు విధించింది. అంతేకాక, బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గతేడాది ఆగస్టు 9 వ తేదీ రాత్రి ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న జూనియర్ వైద్యురాలి పై హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు సంజయ్‌ను ఆరెస్టు చేశారు. ఈ కేసులో ఆర్‌జికర్ మాజి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజి ఆఫీసర్ ఇన్‌చార్జి అభిజిత్ మండల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేసు సిబిఐ స్వీకరించింది.