జ్యురిచ్‌లో తెలుగు పారిశ్రామికల వేత్తలతో చంద్రబాబు బృందం భేటీ
జ్యురిచ్ (CLiC2NEWS): ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జ్యూరిచ్‌లోని తెలుగు పారిశ్రామిక వేత్తలకు సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు సిఎం చంద్రబాబు దావోస్ వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి లోకేశ్, రామ్మోహన్ నాయుడు, ఎంపి టిజి భరత్ ఉన్నారు. ఈ క్రమంలో జ్యురిచ్‌లోని తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూరప్‌లో తెలుగు యువతకు ఉద్యోగ ఉపాధి సంబంధించిన పుస్తకాన్ని సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉందని, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలన్నారు.
జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఎపిలోనూ, యూరప్‌లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామిక వేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు. యూరప్‌లో క్రిప్టో తరహా ఆర్ధిక వ్యవస్థను స్టార్టప్‌గా పెట్టామని, ఎపిని క్రిప్టో .జోన్, క్రిప్టో ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే అవకాశముందని తెలిపారు.
అంతకు ముందు జ్యురిచ్ విమానాశ్రయం నుండి హిల్టన్ హోటల్‌కు చేరుకున్న సిఎం భారత రాయబారి మృదుల్ కుమార్‌తో సమావేశమయ్యారు.