ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి
రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్ , ఒడిశా పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు కలిసి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారు. జనవరి 19 రాత్రి నుండి ఛత్తీస్‌గఢ్ , ఒడిశా సరిహద్దు జిల్లాలలైన గరియాబంద్, నౌపాడు ప్రాంతాలలో పలుమార్లు ఎదురుకాల్పులు నిర్వహించారు. నేడు గరియాబంద్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటి సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోన్ కమిటి సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. వీరిలో చలపతిపై రూ. కోటి రివార్డును గతంలో ప్రభుత్వం ప్రకటించింది. చలపతి చిత్తూరు జిల్లావాసి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతదేహాల వద్ద నుండి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో వెయ్యి మంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం.