AP: ప్రతి పౌరుడికి డిజిలాకర్..
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/diji-locker.jpg)
అమరావతి (CLiC2NEWS): పౌరులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఎపిలో ప్రతి పౌరుడికి AP జారీ చేయనున్నారు. దీని కోసం ప్రతి పౌరుడికి డిజిలాకర్ సదుపాయం కల్పించనున్నారు. అన్ని పత్రాలు వాట్సాప్ లోనే డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు ఐటి శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నన్స్ పై ఐటి శాఖ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ప్రజలు వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు , అర్జీలు చేసే విధంగా.. డేటా అనుసంధాన ప్రక్రియను వెంటనే పూర్తి చేయనున్నారు. చదువు రాని వారు వాయిస్ మెసెజెస్ ద్వారా అర్జీలు, ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి శాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమించేలా చర్యలు తీసుకుంటామని, నిరంతరాయ సేవల కోసం అర్‌టిజిఎస్ ద్వారా డేటా లేక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.