శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసు.. నలుగురు అరెస్టు

తిరుమల (CLiC2NEWS): శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంలో నలుగురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీనెయ్యి సరఫరా చేస్తున్నారనే కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలో నలుగురిని అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కిలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్ , శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉంటున్న శ్రీ వైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఎఆర్ డెయిరీ ఎండి డా. రాజు రాజశేఖరన్ లను రెండో అదనపు కోర్టు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నలుగురికి ఫిబ్రవరి 20 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
మొత్తం 4 ట్యాంకర్లలో నెయ్యి జులై 6, 17 తేదీల్లో తిరుమలకు వచ్చింది . ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించిన టిటిడి వాటిని పరీక్షించింది. ఆనెయ్యి లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణకు ముందుగా రాష్ట్రం సిట్‌ను ఏర్పాటు చేసింది. .. అక్టోర్ నెలలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పటు చేశారు. సిబిఐ నుండి ఇద్దరు, ఎపి పోలీసు శాఖ నుండి ఇద్దరు, పుడ్ సేప్టీ అండ్ స్టాండర్స్ అథారిటి నుండి ఒకరితో ఈ బృందం ఏర్పాటయింది.
తమిళనాడులోని ఎఆర్ డెయిరీ సంస్థ కిలో నెయ్యి రూ.319.80కి సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వద్ద ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ నుండి నెయ్యిని కొనుగోలు చేసి సరఫరా చేసింది. ఈ నెయ్యిని వైష్ణవి డెయిరీ .. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ నుండి కొనుగోలు చేసి, ఎఆర్ డెయిరీ కి సరఫరా చేసింది. వాటిని ఎఆర్ డెయిరీ తిరుమలకు సరఫరా చేసిందని సిట్ దర్యాప్తులో తేలింది.