స్పోర్ట్స్ కోటాలో రైల్వే పోస్టులు
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/jobs-notification-copy-750x313.jpg)
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ( ఆర్ ఆర్‌సి నార్త్‌రన్ రైల్వే) స్పోర్ట్స్ కోటాలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 38 గ్రూప్-డి పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారి నుండి దరఖాస్తును ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు స్పోర్ట్స్ అనుభవం ఉన్నవారికి మాత్రమే అర్హులు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం.. రూ. 18వేల నుండి రూ.56,900 అందుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్కుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది.
అభ్యర్థులు వయస్సు 18 నుండి 25 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు రుసుం జనరల్ / ఇడబ్ల్యుఎస్/ ఒబిసిలకు రూ.500గా నిర్ణయించారు. ఎస్ సి/ ఎస్‌టి/ ఇఎస్ ఎం / ఇబిసి / దివ్యాంగులు/ మహిళలకు రూ.250గా నిర్ణయించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మార్చి 9 లోపు పంపించాల్సి ఉంది. పరీక్ష తేదీ.. సిలబస్.. తదితర విషయాలు గురించి తెలుసుకునేందుకు అభ్యర్థులు https://rrcnr.org/ వెబ్‌సైట్ చూడగలరు.