భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరిస్ .. 142 పరుగుల తేడాతో ఘన విజయం
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/IND-vs-ENG-.-INDIA-WON-THE-MATCH.jpg)
అహ్మదాబాద్ (CLiC2NEWS): ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డే సిరీస్‌లో భారత్ 3-0లో క్లీన్‌స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులు చేసి ఆలౌటయింది. శుభ్‌మన్ గిల్ 112, శ్రేయస్ అయ్యర్ 78, విరాట్ 52, రాహుల్ 40, పాండ్య 17, సుందర్ 14, పటేల్ 13, హర్షిత్ రాణా 13 పరుగులు చేశారు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. మొదటి రెండు వన్డేల్లో ఆర్ధ సెంచరీలు .. మూడో వన్డేలో శతకం సాధించాడు. మూడో వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గాను గిల్ నిలిచాడు.