బాలుర వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
పరిగి (CLiC2NEWS): గిరిజన బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ కుల్కచర్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. అయితే విద్యార్థి మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. బుధవారం రాత్రి పడుకున్న విద్యార్థి గురువారం ఉదయం నిద్రలేవలేదు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది ఆ విద్యార్తిని పరిగి ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి కొన్ని గంటల ముందే మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రికి చేరుకున్న జిల్లా ట్రైబల్ డెవలప్ మెంట్ అధికారి కమలాకర్ రెడ్డి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వసతి గృహంలో తోటి విద్యార్థులతో గొడవలేమి జరగలేదని తెలుస్తోంది. ఆస్పత్రి వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులు తమ కుమారుడి మృతికి గల కారణాలు తెలపాలంటూ ఆందోళనకు దిగారు.