రాత్రి 11 దాటిన తర్వాత థియేటర్‌లోకి పిల్లలు.. తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/high-court.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): పదహారేళ్ల లోపు పిల్లలు రాత్రి 11 గంటలు నుండి ఉదయం 11 గంటల్లోపు సినిమా థియేటర్‌లోకి అనుమతించవద్దని ఇటీవల తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత థియేటర్‌లలోకి పిల్లలను అనుమతించకపోవడంపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో మల్లీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం సంఘం అప్పీలు దాఖలు చేసింది. మల్లీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా నష్టపోతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. అప్పీలుపై జోక్యం చేసుకోలేమని సిజె ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ వద్ద ఉన్న పెండింగ్ పిటిషన్‌లో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీనికి అంగీకరించిన పిటిషనర్లు అప్పీల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.