మణిపుర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/MANIPUR.jpg)
ఇంఫాల్ (CLiC2NEWS): మణిపుర్ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. జాతుల మధ్య ఘర్షణలతో గత కొంతకాలంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలు రోజు రోజుకూ అట్టుడుకుతున్నాయి. ఇటీవల సిఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జరిగిన కొద్ద రోజులకే రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.