ఐసిసి ఛైర్మన్ జైషాతో మంత్రి లోకేశ్ భేటీ..

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాక్ మధ్య వన్డే మ్యాచ్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా అభిమానులు టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షిస్తున్నారు. ఈ పోరును వీక్షించేందుకు సినీప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. ఎపి మంత్రి నారా లోకేశ్ కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఐసిసి ఛైర్మన్ జైషా తో నారా లోకేశ్ సమావేశమయ్యారు. మెగస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్, ఎపి మంత్రి నారా లోకేశ్ , ఎపి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని , ఉపాధ్యక్షుడు సానా సతీశ్ తదితరులు దాయాదుల పోరు వీక్షించేందుకు దుబాయ్ వెళ్లారు. దర్శకుడు సుకుమార్ నారాలోకేశ్తో ఫోటోలు తీసుకున్నారు.