16 ఏళ్ల పిల్లలకు అన్ని షోలకు అనుమతి..

హైదరాబాద్ (CLiC2NEWS): 16 సంత్సరాలలోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. జనవరి 21వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను సవరించి.. మల్లీప్లెక్స్లకు ఊరట కల్పించింది. సినిమా టికెట్ల ధర పెంపు, బెనిఫిట్ షోల విషయంలో న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాత్రి 11 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్ల లోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఈ ఉత్తర్వలపై మల్టీప్లెక్స్ యాజమాన్యా మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఉత్తర్వుల వల్ల ఆర్ధికంగా నష్టపోతామని.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఆక్షంలు ఎత్తివేయాలని కోరింది. వీరి వాదనలు పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పును సవరించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ 16 ఏళ్ల లోపు పిల్లలు థియేటర్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
పుష్ప 2 చిత్రం బెపిఫిట్ షో సందర్భంగా నగరంలోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన తర్వాత సినిమా షోల విషయంలో థియేటర్లకు కొన్ని షరతులు విధించింది. బెనిఫిట్ మరియు ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవని స్పష్టం చేసింది.