ఎసి గదుల్లో కూర్చుంటే ప్రజల కష్టాలు తెలియవు.. సిఎం చంద్రబాబు

చిత్తూరు (CLiC2NEWS): పార్టి నేతలు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని సిఎం చంద్రబాబు అన్నారు. ఎసి గదుల్లో కూర్చుంటే ప్రజల కష్టాలు తెలియవని.. క్షేత్రస్థాయిలో తిరగితేనే అధికారులకు ప్రజల భాధలు తెలుస్తామన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా పార్టి కార్యకర్తలతో సిఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి కోసం త్యాగాలు చేసిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకుంటామన్నారు. టిడిపి నేతలు మరో పార్టీలోకి వెళ్లరని.. వేళ్లలేరన్నారు. మనది మొదటి నుండి క్యాడర్ ఆధారిత పార్టియని.. అందుకే క్లస్టర్ , యూనిట్ బూత్ విధానం తీసుకొచ్చామని తెలిపారు. ఆన్‌లైన్ సభ్యత్వానికి మంచి స్పందన వచ్చిందని.. కోటి 2లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని సిఎం ఈ సందర్బంగా వెల్లడించారు.