360 కిలో మీట‌ర్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తి.. కేంద్ర మంత్రి

గాంధీన‌గ‌ర్ (CLiC2NEWS): దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప‌నులు త్వ‌రిత గ‌తిన జ‌రుగుతున్నాయ‌ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. గుజ‌రాత్‌లోని ఆనంద్‌లో 360 కిలోమీట‌ర్ల‌ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప‌నుల‌ను మంత్రి శ‌నివారం స‌మీక్షించారు. ముంబ‌యి-అహ్మ‌దాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న 200 మీటర్ల పొడ‌వైన స్టీల్ వంతెన‌ను మంత్రి సంద‌ర్శించారు. నిర్మాణ ప‌నులు వేగంగా చేప‌డుతున్న కార్మికుల‌ను ప్ర‌శంసించారు. ఇక్కడ ప‌నిచేసే కార్మికులు , ఇంజినీర్లు, గ‌తంలో చీనాబ్‌, అజి బ్రిడ్జి నిర్మాణంలో ప‌నిచేశార‌ని తెలిపారు. బుల్లెట్ ప్రాజెక్టు పూర్త‌య్యింద‌ని తెలిపిన మంత్రి.. బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతున్న అనే విష‌యం వెల్ల‌డించ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.