రూ.5కే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్: మధ్యప్రదేశ్ సిఎం

భోపాల్ (CLiC2NEWS): మధ్యప్రదేశ్ రాష్ట్ర సిఎం రైతులకు శుభవార్త తెలిపారు. కేవలం రూ.5 కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని సిఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్ లో నిర్వహించిన ఓ ర్యాలిలో సిఎం మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలు మెరుగు పడాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. నీటి పారుదల కోసం సోలార్ పైపుల ద్వారా రైతులకు విద్యుత్ సంబంధిత ఇబ్బందుల్ని తమ ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. రాబోయే మూడేళ్లలో 30 లక్షల సోలార్ ఇరిగేషన్ పంపుల్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సిఎం తెలిపారు. వారి నుండి ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తుందని తెలిపారు.