కర్రలపై నడుస్తూ.. శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు..

శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు కర్రలపై నడుస్తూ పాదయత్రగా వెళుతున్నారు. ఉగాది సమీపిస్తుండటంతో కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీశైల మల్లన్న దర్శనానికి వస్తున్నారు. కొందరు కాళ్లకు కర్రలు కట్టుకుని, వాటితో నడుస్తూ.. మరికొందరు శివలింగాన్ని పల్లకిలో ఉంచి మోసుకుంటూ మల్లన్న దర్శనానికి వెళుతున్నారు. శివనామస్మరణ చేస్తూ కర్నూలు మీదుగా పాదయాత్ర చేస్తూ , అక్కడక్కడ సేదతీరుతూ భక్తులు స్వామి దర్శనానికి వెళుతున్నారు.