పూత‌ల‌ప‌ట్టు జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

తిరుప‌తి (CLiC2NEWS): వేగంగా వెళుతున్న కారు.. కంటైన‌ర్ కిందికి దూసుకుపోయి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న‌ ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ఘ‌ట‌న తిరుప‌తి జిల్లాలోని పాకాల మండ‌లం తోట‌ప‌ల్లి వ‌ద్ద జ‌రిగింది. పూత‌ల ప‌ట్టు-నాయుడు పేట జాతీయ ర‌హ‌దారిపై భారీ కంటైన‌ర్ కింద‌కు కారు దూసుకుపోయింది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో 9 ఏళ్ల చిన్నారితో పాటు ఐదుగురు ఉన్నారు. వారంతా ఘ‌ట‌నా స్థ‌లంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా త‌మిళ‌నాడులోని కృష్ణ‌గిరి వాసులుగా గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.