పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ భారత సైన్యం..

ఆపరేషన్ సిందూర్ దాడుల అనంతరం పాకిస్థాన్.. భారత సైనిక స్థావరాపై దాడులకు యత్నించింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రకత్నించగా.. భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంది. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాలైన అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, అదామ్‌పుర్, భఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించింది. అయితే వీటిని భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్ధంగా అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. చైనాకు చెందిన హెచ్ క్యూ-9 రక్షణ వ్యవస్థలను పాకిస్థాన్ ఉపయోగించినట్లు సమాచారం. పాకిస్థాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుండి సేకరిస్తున్నట్లు భారత రక్షణ శాఖ తెలిపింది.
మరోవైపు నియంత్రణ రేఖ (LoC) వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దాడులను పాల్పడుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్లోని రాజౌరి , మొందార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మోర్టార్లు, భారీ ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీని కారణంగా ఇప్పటి వరకు 16మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.